ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ పై కొద్ది రోజులుగా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో థియేటర్లలో నడుస్తున్న బ్లాక్ దందా కు చెక్ పెట్టాలని జగన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నిన్న అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్టం మార్పులను వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు ఉంటుంది... పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్న తేడా లేకుండా ఒకే టికెట్ రేటు అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ క్రమంలోనే బ్లాక్ మార్కెట్ కు పూర్తిగా చెక్ పెట్టేశారు. టికెట్ రేట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. పైగా టికెట్లను ఆన్లైన్లో ప్రభుత్వం నిర్వహించే పోర్ట‌ల్ ద్వారానే అమ్మాల‌ని కూడా మంత్రి చెప్పారు. ఈ పరిణామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా మా థియేటర్ల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయలు పోసి ఆధునీకరించిన థియేటర్లను నిర్వహించే పరిస్థితి లేదని చెబుతున్నారు.

తాము లక్షలాది రూపాయలు ఖర్చు చేసి థియేటర్లను ఆధునికీకరణ చేశామని... అయితే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న‌ రేట్లతో థియేటర్లను నిర్వహించే పరిస్థితి లేదని నిర్వాహ‌కులు గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు 50కి పైగా థియేటర్లను క‌రోనా దెబ్బ‌తో మూసేశారు. ఇప్పుడు కూడా ఈ థియేటర్లను తిరిగి ఓపెన్ చేయలేదు. ఇవి చాలా వ‌ర‌కు క‌ళ్యాణ మండ‌పాలు, ఫంక్ష‌న్ హాల్స్ గా మారిపోయాయి.

ఇక ఇప్పుడు ప్ర‌భుత్వ నిర్ణ‌యం తో మ‌రో 50 థియేట‌ర్ల కూడా మూసి వేసేలా యాజ‌మాన్యాలు నిర్ణ‌యం తీసుకుంటున్నాయ‌ట‌. పెద్ద ప‌ట్ట‌ణాలు, మున్సిపాల్టీ ల్లో ఉన్న థియేట‌ర్ల సంగ‌తి ప‌క్క‌న పెట్టేస్తే బీ, సీ సెంట‌ర్ల లో ఉన్న థియేట‌ర్ల‌లో చాలా వ‌ర‌కు థియేట‌ర్ల మూత ప‌డ‌నున్నాయి. ఏపీలో మొత్తంగా ఓ 100 థియేట‌ర్ల‌ను తిరిగి తెరిచే ప‌రిస్థితి లేదంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: