తెలుగు సినిమా పరిశ్రమలో అతి తక్కువ కాలంలో భారీగా రెమ్యునరేషన్ పెంచిన హీరోయిన్లలో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూజా హెగ్డే ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం ఉందని ఈ సినిమా తర్వాత ఆమె తమిళంలో కూడా ఒక అగ్ర హీరోతో సినిమా చేసే అవకాశం ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ఉందని అంటున్నారు.

ఈ సినిమాల తర్వాత పూజా హెగ్డే కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతుందని ఏది చేసినా సరే ఎక్కువగా డిమాండ్ చేస్తూ ముందుకు వెళుతుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో డాన్స్ చేయాలి అంటే కచ్చితంగా ఆమెకు కోటి నుంచి రెండు కోట్ల వరకు ఇచే పరిస్థితి ఉందని టాలీవుడ్ జనాల మాట. ఇటీవల పూజా హెగ్డే ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దాదాపుగా రెండున్నర కోట్ల వరకు డిమాండ్ చేసిందని సమాచారం.

దీంతో సదరు నిర్మాత ఒక్కసారిగా షాక్ అయి ఆమె ప్లేస్ లో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని 40 లక్షలకు తీసుకు వచ్చాడని సమాచారం. ఐటెం సాంగ్ కు అంత ఖర్చు చేస్తే ఇక తాను పారిపోయే అవకాశం ఉంటుందని అందుకే చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించారు అని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే పూజా హెగ్డే తెలుగులో అంత భారీగా డిమాండ్ చేయడం అనేది చాలా మంది అగ్ర హీరోలు కూడా భయపెడుతుంది అనే అంశంగా కొంతమంది నిర్మాతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: