నాగచైతన్య విడాకుల తర్వాత సమంత కాస్త సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది అనే విషయం కొన్ని రోజులుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీ గా మారే ప్రయత్నం చేస్తూ ఉండగానే కొన్ని ఆఫర్లు కూడా ఆమె తలుపు తడుతున్నాయి అని కొంతమంది అంటున్నారు. సమంత ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండగా ఆమెకు ఐటమ్ సాంగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయని ఈ నేపథ్యంలోనే ఆమె ఐటం సాంగ్ విషయంలో కాస్త సీరియస్ గా ఉందని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

ఐటమ్ సాంగ్ విషయంలో సమంత ఈ మధ్య కాలంలో కాస్త వెనక్కు తగ్గిందని గతంలో ఐటమ్ సాంగ్ చేయడం వల్ల తన క్రేజ్ తగ్గింది అనే భావనలో సమంత ఉందని అందుకే ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినా సరే ఆమె చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడటం లేదని అది ఎవరు సినిమా ఆమె ఇష్టపడటం లేదనేది టాలీవుడ్ జనాల మాట. ప్రస్తుతం సమంత రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే ఈ సినిమాలో ఆమె పాత్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా అంటున్నారు.

సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని నటన పరంగా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే మాత్రం కచ్చితంగా సినిమాను చేయడానికి ఆమె వెనకడుగు వేయటం లేదని చాలామంది అంటున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కొన్ని కొన్ని అంశాలు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్లు ఐటం సాంగ్స్ విషయంలో కాస్త ఆలోచిస్తున్నారు. మరి సమంత ఫ్యూచర్ లో ఏ విధంగా ముందుకు రాబోతుంది ఆమె సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: