ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా కోసం సౌత్ సినిమా ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక బన్నీ సరసన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక పూర్తి డిగ్లామరస్ రోల్ లో కనిపించనుంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న ఈ సినిమా మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.

 ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, శ్రీవల్లి, సామి సామి, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే మూడు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 12న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలని చిత్రయూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులోని జరుపుతున్నారట. ఈ మేరకు ఎంతో ఘనంగా ఈ ఫంక్షన్ ని జరపాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ పజిల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా మార్కెట్ నీ టార్గెట్ చేశాడు. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే బన్నీ తదుపరి ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: