పూజా హెగ్డే, సమంత ఇద్దరికి ఇద్దరు ఏమాత్రం తీసిపోరు. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లగా దూసుకుపోతున్నారు. ఇద్దరికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లో  వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ బాగానే ఉన్నా.. ఆ మధ్య ఓ సారి పూజా అకౌంట్ హ్యాక్ అవ్వడం..ఇక ఆ అకౌంట్ నుండి సమంత గురించి నెగిటివ్ కామెంట్స్ రావడం..దీంతో అటు సమంత అభిమానులు..ఇటు పూజా అభిమానులు ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఆ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియాలో వైరల్ గారి పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. ఇక అప్పటి నుండి వీళ్లిద్దరూ అసలు మాట్లాడుకోవడమే మానేసారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.

కాగా రీసెంట్ గా లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. మన టాలీవుడ్ బుట్టబొమ్మ ఓ అద్దిరిపోయే ఆఫర్ ని చేత్తులారా వదిలేసుకుందట. ఇక ఆ అవకాశాని సమంత దక్కించుకుంది అని ఇండస్ట్రీలో ఓ వార్త తెగ  హల్ చల్ చేస్తుంది. టాలీవుడ్ ప్రిన్స్  హీరో సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని   మహేశ్‌ బాబు ప్రస్తుతం పరశూరాం డైరెక్షన్ లో  ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా  షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు మహేష్. ఈ మూవీని చేస్తున్న టైంలోనే త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్న అని ప్రకటించేసాడు మహేశ్‌ బాబు. అంతేకాదు ఆయన  పుట్టిన రోజు  సందర్భంగా తివిక్రమ్‌ టీం #SSMB28 అనే పేరుతో ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు.

కాగా ఈ మూవీలో మహేశ్‌ బాబుకు జంటగా పూజ హెగ్డేను ఫైనల్  చేసినట్లు  వార్తలు వినిపించాయి. ఇక ఇది వరకే వీళ్లిద్దరు మహర్షి సినిమా లో కలిసి నటించారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. దీంతో తెర పై మరోసారి ఈ జంట కనపడితే హిట్ పక్కా అనుకున్నాడు తివిక్రమ్‌ . కానీ బిజీ షెడ్యూల్ కారణంగా  పూజా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూజా ఈ సినిమాని వదిలేసుకోవడంతో ఆ ఆఫర్ సమంత దగ్గరకు రాగా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని.. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి మరి కొన్ని రోజుల్లో   తివిక్రమ్‌ టీం అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: