టాలీవుడ్ లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే దేవి శ్రీ ప్రసాద్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ ఈయన సంగీతానికి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన దేవి ఇప్పటికీ వివాహం చేసుకోలేదంటే ఆయన ఫ్యాన్స్ కి ఇది చాలా పెద్ద విషయమే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హోదాకి చేరుకుని ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతూ ఇమేజ్ గ్రాఫ్ ని ఏ మాత్రం డౌన్ అవకుండా చూసుకుంటున్నా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి.

కాగా ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇవే అంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ చార్మితో డిఎస్పీ ప్రేమాయణం చాలా ఘాటుగా సాగిందని వీరి రిలేషన్ పీక్స్ కు చేరిందని త్వరలో పెళ్లి అని వార్తలు గతంలో చాలా సార్లు వినిపించాయి. ఆ తరవాత పలు కారణాల వలన వీరిద్దరూ విడిపోయారని ఆ బాధతోనే దేవి శ్రీ ఇప్పటికీ పెళ్లి వైపు అడుగు వేయలేకపోతున్నారు అని అంటుంటారు. విషయం ఏదైనా దేవి శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన సంగీత దర్శకుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అవ్వాలని ఎంతగానో ఆశ పడుతున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే దేవి శ్రీ ప్రసాద్ పెళ్లిపై ఎటువంటి వాసన లేదు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ వయసు 42 సంవత్సరాలకు చేరుకుంది. కాబట్టి టాలీవుడ్ లో కెరీర్ పరంగా మంచి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో పెళ్లి కన్నా ప్రొఫెషన్ పరంగా సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి విషయాన్నీ పక్కకు పెట్టేస్తాడని అర్ధమవుతోంది. ఒకవేళ తన మనసు మారి పెళ్లి చేసుకుంటే సంతోషమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: