బాలక్రిష్ణ పక్కా మాస్ హీరో. ఆయన రేంజి ఏంటి అన్నది మేకర్స్ కి కూడా ఒక్కోసారి అర్ధం కాదు. ఇక బాలయ్య రిస్క్ ని ఎపుడూ ఆహ్వానిస్తాడు అంటారు. ఆయన మిగిలిన వారి మాదిరిగా సీజన్లు,  లెక్కలు అంచనాలు గట్టిగా వేసుకోరు. ఆడియన్స్ మీద నమ్మకం పెట్టేసి బొమ్మ అలా  వదిలేస్తారు.

ఇపుడు కూడా అలాంటిదే ఆయన చేస్తున్నారు. డిసెంబర్ నెల మొదలవుతూనే 2వ తేదీన బాలయ్య అఖండ మూవీ రిలీజ్ అవుతోంది. నిజానికి డిసెంబర్ మూడవ వారం వరకూ డ్రైగానే ఉంటుంది. ఎక్కడా సెలవులు లేవు. ఇపుడు ఏపీలో చూస్తే అయిదారు జిల్లాలు వరదలతో నిండి ఉన్నాయి. మరిన్ని తుఫాన్లు ముంచెత్తుతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 2న బాలయ్య మూవీ అఖండ రిలీజ్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే రిలీజ్ అంటున్నారు.

ఇక ఈ మూవీ రిలీజ్ వేళకు టికెట్ల ఇక్కట్లు తీరుతాయని భావించారు. అయితే ఆ ముచ్చట కూడా లేదు. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ఏపీ సర్కార్ తీసుకువచ్చింది. అయితే టికెట్లు మాత్రం పెంచలేదు. అంతే కాదు బెనిఫిట్ షోస్ కూడా రద్దు చేసింది. దీంతో పెద్ద హీరోల సినిమాలకు కష్టాలు తప్పవని అంటున్నారు. సరిగ్గా ఆన్ లైన్ టికెటింగ్ విధానం ఆమోదం తరువాత వస్తున్న మొదటి పెద్ద సినిమా అఖండగానే చూడాలి. ఈ మూవీ యధా ప్రకారం నాలుగు ఆటలుగా వేయాలి. దాంతో కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అదే టైమ్ లో జనాలను ఎంత వరకూ థియేటర్ల దాకా ఈ మూవీ తెస్తుంది అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే కరోనా రెండవ దశ తరువాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే. మొత్తానికి బాలయ్య సినిమాకు ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా కలెక్షన్లు వచ్చి పాజిటివ్ టాక్ కనుక వస్తే టాలీవుడ్ మొత్తానికి మూవీరి వచ్చినట్లే. దాంతో అఖండ హిట్ కావాలని అంతా గట్టిగానే కోరుకుంటున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: