చిత్ర పరిశ్రమ లో ఒక సినిమా నిర్మించడానికి దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఏ విధంగా ముఖ్యపాత్ర వహిస్తారు సంగీత దర్శకుడు కూడా అంతే ముఖ్యం. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని సంగీతం ద్వారా ప్రేక్షకుల మనసులో ఇంకో స్థాయిలో చిత్రించవచ్చు. ముఖ్యంగా పాటలు,  ఎమోషనల్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ గురించి అయితే  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ప్రమోషన్ లో కూడా సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి సంగీతం బట్టి సినిమా అంచనాలు మారిపోతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు చాలా మంది సంగీత దర్శకులు వారి స్టైల్లో ఎంత మంది అభిమానులను ఏర్పరుచుకున్నారు.

అటువంటి  తెలుగు సినిమా సంగీత దర్శకులలో అనూప్ రూబెన్స్ ఒకరు అని చెప్పవచ్చు. అనూప్ రూబెన్స్ 1980 మార్చి 20  తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించారు. దర్శకుడు తేజ తీసిన జై సినిమా ద్వారా 2004లో పరిచయమయ్యాడు. సీతారాముల కళ్యాణం లంకలో, నేను నా రాక్షసి, ప్రేమ కావాలి, పూలరంగడు, ఇష్క్ వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇక  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మించిన మనం సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా చేశారు . ఈ సినిమా  అనూప్ రూబెన్స కెరియర్ మార్చిందని చెప్పవచ్చు.ఈ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అవార్డు అందుకున్నారు.


2011 వ సంవత్సరంలో దర్శకుడు పూరి జగన్నాధ్ అమితా బచ్చన్ కాంబినేషన్లో వచ్చిన బుడ్డా హోగా తేరా బాప్ అనే హిందీ సినిమాలో హీరో అమితాబ్ బచ్చన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా  చేశారు. ఈ సంగీత దర్శకుడు ఒక సినిమాకు 40 - 50 లక్షల వరకు పారితోషకం తీసుకుంటారట.ఈ సంగీత దర్శకుడు సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా పని చేశారు. 2020 వ సంవత్సరంలో విడుదలైన ఎక్స్పైరీ డేట్ అనే హిందీ వెబ్ సిరీస్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేశారు. అంతే కాకుండా ఎన్నో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన కూడా మూడు పాటలను అనూప్ రూబెన్స్ చేశారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: