నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాల్యయ్య అభిమానులు అయితే ఈ సినిమాను ఎప్పుడు చూసేద్దామని తెగ ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే బాలయ్య-బోయపాటి కాంబో కి ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సింహా, లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా గా రాబోతున్న అఖండ పై కూడా ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఇక ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్రెడ్డి దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నాడు.

 ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్,  పాటలు ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ దక్కించుకోవడమే కాకుండా ఆ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చాయి. ఇక డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ యు/ ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మరోసారి మాస్ పాత్రతో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 నవంబర్ 27వ తేదీన అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తున్నాడనే విషయం తెలియడంతో ఇటు నందమూరి ఫాన్స్ తో పాటు ఆటో మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక పుష్ప తర్వాత మరోసారి బోయపాటి తో సినిమా చేయనున్నాడు బన్నీ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: