ఒక హీరో కి సంబంధించి ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే ఆ సినిమాలో తమ హీరో ఏ పాత్రలో నటిస్తున్నాడు ఆ పాత్ర పేరు ఏంటో తెలుసుకోవటానికి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు హీరో ఫాన్స్. అంతా ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులకు కొన్ని కొన్ని సినిమాలలో హీరో క్యారెక్టర్ చేసే హీరోకి అసలు పేరే ఉండదు.అయితే  సినిమాలలో హీరో  పేరు  పెట్టరు దర్శకులు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం సినిమా రాసుకునేటప్పుడు హీరోకి పేరు లేకుండానే కథలను రాసి పూర్తి చేసుకుంటారట . ఈ విషయం వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం . తెలుగు సినిమాలలో ఎలా జరుగుతుంది అయితే మన తెలుగు సినిమాలలో కొన్ని సినిమాల్లో అయితే సినిమా చివరి దాకా కూడా హీరోని పేరు పెట్టి ఎవరు పిలవరు . నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం.

 ఉదాహరణకి మహేష్ బాబు నటించిన సినిమా అర్జున్ ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది . అయితే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ఉండడంవల్ల చాలా వరకూ ప్రేక్షకులు ఈ సినిమాను మెచ్చారు. అయితే ఈ సినిమాలో హీరో ని పేరు పెట్టి  చివరి వరకు ఎవరూ కూడా పిలవరు. సినిమా చివరి నిమిషంలో అర్జున్ అని పిలవడంతో ఈ సినిమాలో హీరో పేరు అర్జున్ అని తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కూడా పేరు లేకుండా సినిమాలో నటించాడట. మెగాస్టార్ చిరు నటించిన రాక్షసుడు సినిమా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా  తెరకెక్కింది.

అయితే అప్పట్లో ఈ సినిమా ఎవరు ఊహించని రేంజిలో విజయాన్ని సాధించింది. దాదాపుగా 35 ఏళ్ల కింద  ఈ సినిమా 100 రోజులు ఆడింది . అయితే అర్జున్ సినిమా లో లాగానే ఈ సినిమాలో కూడా చిరు ని ఎవరు పేరు పెట్టి పిలవరు. ఈ సినిమాలో చిరంజీవి స్నేహితుడుగా నటించిన నాగబాబు తన ని ఫ్రెండ్ అని పిలుస్తాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాధా చిరుని పురుష అని  పిలుస్తుంది. అయితే చిరు నటించిన ఈ సినిమా ఆఖరి వరకు కూడా ఎవరు పేరు పెట్టి పిలవరు. దీంతో పేరులేని పేరులేని క్యారెక్టర్ చేసినట్టు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల . ఈ సినిమాలో కూడా హీరోలకు పేర్లు లేవు. విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు నటించిన ఆ సినిమాలలో వారికి పేర్లు ఉండవు చిన్నోడా పెద్దోడా అని మాత్రమే పిలవడం జరుగుతుంది ఇలా కొన్ని సినిమాలలో హీరో పాత్రలకు పేర్లు లేకుండానే తీశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: