మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా మరోవైపు శంకర్ సినిమా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు చెర్రీ. రాజకీయ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ అంచనాల తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగులో తొలిసారిగా శంకర్సినిమా చేస్తుండడం విశేషం.  ఇక పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియా లోనే భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవలే ప్రశాంత్ చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

దాంతో అందరూ ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు అని అనుకున్నారు. తాజాగా ఇదే నిజమని కూడా కొన్ని వార్తలను బట్టి తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ చరణ్ కోసం రెండు కథలు సిద్ధం చేశాడని వాటిలో ఏది డిసైడ్ చేయాలో అన్న ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడని తెలుస్తుంది. మరి ఇప్పటికే ప్రభాస్ ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేయబోతున్న ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తేజ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరి వరుసగా పాన్ ఇండియా సినిమా లు చేస్తున్న రామ్ చరణ్సినిమా తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: