భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు తమ తమ టాలెంట్ ను నిరూపించుకుని ప్రేక్షకులను తన సంగీతంతో ఇప్పటిదాకా అలరిస్తూ వచ్చారు. అన్ని రకాల వైవిధ్యభరితమైన సంగీతంతో వారు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా హరీష్ జయరాజ్ లాంటి సంగీత దర్శకుడు మరొక లేరనే చెప్పాలి. ఒక్కో సంగీత దర్శకుడు ఒక విభాగంలో దిట్ట. ఒకరు శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా అందిస్తే మరొకరు పాశ్చాత్య సంగీతాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేసారు.

కానీ హరీష్ జయరాజ్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అన్ని రకాల సంగీతాన్ని ప్రజలకు అందిస్తూ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. పాప్ సంగీత ప్రపంచంలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అలాగే ఆయన ఏ సినిమాకు సంగీతం అందించిన కూడా ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు మ్యూజికల్ హిట్ గా ఈ చిత్రం నిలిచిపోతుంది. అలా తన పాటలతో తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకొని తమిళనాట ఉన్న సంగీత దర్శకుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరీష్ జయరాజ్. 

తెలుగులో సైతం ఆయన పలు సినిమాలకు సంగీతం అందించి ఇక్కడ కూడా భారీ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ హీరో గా నటించిన ఆరంజ్ సినిమా కు ఆయన ఆరు పాటలు సంగీతం అందించగా పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయి ఈ సినిమా పై మంచి క్రేజ్ ను పెంచాయి. అంతేకాకుండా కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన హరీష్ జయరాజ్ ఇప్పుడు సినిమాల పరంగా అవకాశాలు కొంత తగ్గాయని చెప్పాలి. కొత్త సంగీత దర్శకులు రావడం వల్ల ఆయనకు డిమాండ్ తగ్గిపోయింది. అయితే ఎప్పటికప్పుడు తనను నిరూపించుకునే హరిస్ ఈసారి ఎలాంటి సినిమా తో కం బ్యాక్ అవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: