ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలు మన టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ కీలక నేతలే మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్. ఈ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కి చాలా మంచి స్నేహితులు. గతంలో కొడాలి నాని నిర్మాతగా సాంబ సినిమా వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. 2004లో కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత సాంబ సినిమా విడుదలైంది. ఇక ఆ తర్వాత 2009 వ సంవత్సరం లో మళ్ళీ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ తో 'అదుర్స్' సినిమాని నిర్మించారు.

 ఈ సినిమాకి కూడా వి.వి.వినాయక్ డైరెక్టర్ కావడం విశేషం. ఇక ఈ సినిమా విడుదల తర్వాత రాజకీయంగా కొడాలి నాని దారి వేరు అయింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇదిలా ఉంటే మరోసారి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారని వార్త ప్రచారంలో ఉంది. నిజానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ ప్రచారం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇక ఈ సినిమాకు కూడా వి.వి.వినాయక్ దర్శకుడు అని అంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఫుల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా ఉంది.

 ఆ సినిమా పూర్తయ్యాక తన 31 సినిమా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. అయితే ఈ సినిమాల తర్వాత వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మాతలుగా ఎన్టీఆర్ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఎన్టీఆర్ ఈ ఇద్దరికీ ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. నిజానికి అదుర్స్ సినిమా తర్వాతే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండాలి. కానీ ఆ సినిమా తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలన్నీ పూర్తయ్యాక ఈ కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాకి కూడా వినాయక్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నా.. చివర్లో డైరెక్టర్ మారే ఛాన్స్ కూడా లేకపోలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: