ప్రస్తుతం బుల్లితెరపై అసలు సిసలైన డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ టీవిలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం. దాదాపు 13 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ డాన్స్ రియాలిటీ షోగా కొనసాగుతోంది. ఇప్పుడు కేవలం డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. దీంతో ఈ కార్యక్రమం అంతకంతకూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ షో ఈ 13 ఏళ్ల లో ఎంతో మంది కొత్త డాన్స్ మాస్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది అని చెప్పాలి.


 సాధారణంగా ఎపిసోడ్ లోనే ఇక ఈ షోలో ఉండే కంటెస్టెంట్ డాన్స్ ఇరగదీస్తూ ఉంటారు..  అలాంటివి గ్రాండ్ ఫినాలే వచ్చింది అంటే చాలు ఇక డాన్స్ తో అదరగొట్టడం చేస్తూ ఉంటారు.  అయితే ప్రతి సీజన్లో కూడా గ్రాండ్ ఫినాలే కి ఒక సినీ సెలబ్రిటీ ని  గెస్ట్ గా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభుదేవా లాంటి సెలబ్రిటీలు గ్రాండ్ ఫినాలే కి స్పెషల్ గెస్ట్ గా వచ్చి ఢీ షో విన్నర్ లను  ప్రకటించారు. ఇక ఇప్పుడు ఢీ పదమూడవ సీజన్ కూడా గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. దీంతో ఇక ఈ గ్రాండ్ ఫినాలే కి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ను స్పెషల్ గెస్ట్ గా పిలిచారు ఇక ఇటీవలే ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి రాబోతున్నాడు అంటూఒక ప్రోమో కూడా విడుదల చేయగా అభిమానులందరి లో కూడా ఎంతగానో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి సంబంధించి మరో ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో లో భాగంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్  ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే పాట పై ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అంత స్టైల్ గా నడుచుకుంటూ వచ్చారు. ఇక ఈ ప్రోమో చూసి అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: