సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు ప్రేమలు , గాసిప్ లు సర్వ సాధారణ విషయాలు అన్నది తెలిసిందే. అయితే చాలా మంది నటులు తమ విషయంలో వచ్చిన గాసిప్ ల‌ను నిజం చేస్తూ ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. సినిమా రంగంలో హీరోలు - హీరోయిన్ల మధ్య సీక్రెట్ ప్రేమలు ... సీక్రెట్ డేటింగ్ లు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. వీరు అవకాశాలకోసం ఎప్పుడు ఎవరితో ప్రేమలో వుంటారో ఎవరితో డేటింగ్ చేస్తారో ... ఎప్పుడు విడిపోతారో .. తిరిగి ఎవరితో ప్రేమలో పడతారో కూడా తెలియదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి హీరోయిన్ల పై చాలా రూమర్లు వస్తూ ఉండేవి.

ఈ క్రమంలోనే కొంతమంది స్టార్ హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఊహించని షాక్ ఇచ్చారు. ఈ లిస్టులో అలనాటి మహానటి సావిత్రి నుంచి నేటి తరం హీరోయిన్ల వరకు చాలా మంది ఉన్నారు. ఈ లిస్ట్ ఒక్కసారి చూస్తే మహానటి గా పేరు తెచ్చుకున్న సావిత్రి అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ సూపర్ స్టార్ జెమినీ గణేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

విచిత్రమేంటంటే ఈ విషయం నాలుగు సంవత్సరాల వరకు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పాటు విడిపోయారు. జెమిని గణేష్ సావిత్రి ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక మన తెలుగు హీరోయిన్ జ‌య‌ప్ర‌ద‌ బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ న‌హ‌తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే జయప్రద పెళ్లి విషయం కూడా ఎవరికీ తెలియదు. శ్రీకాంత్ కు కూడా అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక అతిలోక సుందరి శ్రీదేవి సైతం ముందుగా బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం జరిగింది. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం కూడా చేశారని అంటారు. ఆ తర్వాత బోనీకపూర్ శ్రీదేవి జీవితంలోకి ఎంట‌ర్ కావ‌డంతో అతి కొద్ది మంది సమక్షంలో బోనీని పెళ్లాడారు. విచిత్రమేంటంటే బోనికపూర్ కు కూడా అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారు.

ఇక నితిన్ హీరోగా అఆ సినిమాలో చెల్లిగా నటించిన అన‌న్య‌ సైతం ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. ఆమె ఆంజనేయులు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక సీనియర్ నటి సీత‌ సైతం దర్శకుడు పార్తీబ‌న్‌ను సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అత‌డి నుంచి విడిపోయిన తర్వాత ఆమె బుల్లితెర నటుడు సతీష్ అనే వ్యక్తిని కూడా ఎవరికీ తెలియకుండానే పెళ్లాడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: