దివ్య‌భార‌తి .. ఓ అందాల తార‌. చక్కటి రూపం ఎప్పుడు హ్యాపీగా కనిపించే మొహం..దానికి తగ్గ నవ్వు.. చూస్తుంటే దేవ కన్య నే దిగివచ్చిందా అనిపించేలా ఉండేది. కానీ ఏం లాభం చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. దివంగత హీరోయిన్ దివ్య‌భార‌తి గురించి ఎంత చెప్పినా అది చూసేవాళ్లకి తక్కువగానే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో అంత మంచి పేరు సంపాదించుకుంది ఆమె. బొబ్బిలి రాజా సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన‌ ఈ భామ‌.. అనతి కాలంలోనే ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ రెండూ చోట్ల స్టార్‌డమ్‌ను ద‌క్కించుకుంది. అయితే ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే కోట్లాది మంది అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయింది.

ఇక అలాంటి తారను రిప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆమె లా క్రేజ్ ఎవరు సంపాదించుకోలేరు అనే టైంలో వచ్చింది ఓ ఆటో బాంబ్. ఆమె పేరే "మమత కులకర్ణి". దివ్యభారతి చనిపోయిన తరువాత  అచ్చం దివ్యభారతి పోలికలతో ఉన్నటువంటి హీరోయిన్  గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మమత. దివ్య భారతి లానే ఆమె కూడా ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి.. మనల్ని మెప్పించి..దివ్యభారతి అభిమానులను సైతం మైమరపించింది. కెరీర్ పీక్స్ టైంలో ఉండగానే  టాప్ లెస్ ఫోటో షూట్ లో పాల్గోని హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పట్లో ఈమె చేసిన ఈ పనికి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఇక ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగడంతో ఇక చేసేదేమి లేక భారీ జరిమానను కట్టిందట.

అంతేకాదు..2016 సంవత్సరంలో ఓ సినిమా విషయంలో పెద్ద వివాదం చెలరేగడంతో.. మమతా కులకర్ణి అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా మమతా కులకర్ణి అందమైన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో  మరోసారి ఈమె వార్తల్లో నిలిచారు. మమతా కులకర్ణి ప్రేమశిఖరం మూవీ ద్వారానే తెలుగు తెరకు పరిచయమవ్వడం విశేషం. ఎందుకంటే మొదట  ఈ సినిమాలో హీరోయిన్ గా  దివ్యభారతి నటించాల్సి ఉంది. కానీ ఆమె షూటింగ్ మధ్యలోనే  చనిపోవడంతో అదే పోలికలతో ఉన్న..మమతా కులకర్ణి ని  హీరోయిన్ తీసుకొని ఈ సినిమాను పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూస్తే నిజంగా దివ్య భారతినే చేసిందేమో అనిపించేలా మమతా కులకర్ణి యాక్ట్ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: