టాలీవుడ్ సౌతిండియాలో అతి పెద్ద ఇండస్ట్రీ. భారతీయ సినీ రంగంలో చూస్తే బాలీవుడ్ తరువాత స్థానంలో ఉంది. టాలీవుడ్ లో రాసీ వాసీ బాగానే ఉంటాయి. ఈ మధ్యన పాన్ ఇండియా మూవీస్ తో టాలీవుడ్ బాలీవుడ్ కి గట్టి పోటీ విసిరింది.

బాహుబలి తరువాత టాలీవుడ్ ఖ్యాతి ప్రపంచానికి తాకింది అన్న మాట ఉంది. అయితే టాలీవుడ్ లో సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నా సక్సెస్ పెర్సెంటేజ్ తగ్గుతోందని కూడా చర్చ ఉంది. ఆ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో మెగస్టార్ చిరంజీవి దీని మీద మాట్లాడుతూ సక్సెస్ రేటు పది శాతం నుంచి పదిహేనే అని చెప్పారు. అంటే వంద సినిమాలు రిలీజ్ అవుతున్నా హిట్ అయి డబ్బులు రాబట్టేవి పదిహేను సినిమాలు మాత్రమే అన్న మాట.

దీనికి అనేక కారణాలు ఉన్నాయి. టాలీవుడ్ లో బడ్జెట్ కంట్రోల్ లేదు అన్నది కూడా విమర్శగా ఉంది. గతంలో అయితే అనేక రకాలైన జానర్లలో సినిమలౌ వచ్చేవి. బడ్జెట్ మూవీస్, ఆఫ్ బిట్ మూవీస్ కి కూడా ఆదరణ ఉండేది. ఇపుడు కేవలం పెద్ద సినిమాలకే అది కూడా సూపర్ స్టార్ల మూవీస్ కే జనాల ఆసక్తి ఉంటోంది.

మరి జనాల్లో వచ్చిన మార్పా లేక నిజంగానే చిన్న సినిమాల్లో కంటెంట్ లేదా అంటే అది పూర్తిగా తప్పే అంటున్నారు. టాలీవుడ్ లో చిన్న సినిమాలు కొత్త హీరోల మూవీస్ ఈ మధ్య రిలీజ్ అయి హిట్లు కొట్టాయి. అలా వచ్చిన వాటిలో ప్రయోగాలు కూడా ఉన్నాయి. సమస్య ఏంటి అంటే వాటికి పెద్దగా ప్రమోషన్ దొరకడంలేదు, అదే సమయంలో థియేటర్లు కూడా లేకుండా చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

టాలీవుడ్ లో పెద్దలంతా కలసి చిన్న సినిమాలను కంటెంట్ మూవీస్ ని బతికిస్తే ఒక స్టార్ హీరో హిట్ అయితే వచ్చే దాని కన్నా పదింతలు వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. అలాగే టాప్ హీరోల సినిమాలు కేవలం పండుగలను టార్గెట్ చేయకుండా చిన్న సినిమాలకు వదిలిపెడితే అవి మరింతగా సక్సెస్ అవుతాయని అంటున్నారు. అన్ని రకాల హంగులు ఉన్న బడా సినిమాలు ఎపుడు రిలీజ్ అయినా జనాలు థిఎయటర్లకు వస్తారు. మరి వారికి కూడా భయం ఉంటే చిన్న సినిమాలు ఎలా బతుకుతాయి. సో ఇండస్ట్రీని బతికించుకునే మార్గాలు ముందు అక్కడే వెతకాలి అన్న సూచనలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: