దక్షిణాదిలోనే టాప్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు శంకర్. ఆయన సినిమాలు ఎంతటి భారీ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎంత చిన్న సీన్ అయినా ఆయన భారీగా ఖర్చు పెట్టి ఆ సీన్ ను తెరకెక్కించి సినిమా కే కళ తీసుకువస్తాడు. ఇక ఆయన సినిమాలలో పాటలు తెరకెక్కించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రేమ పాటలను తెరకెక్కించడంలో ఆయనకు ఉన్న స్పెషాలిటీ ఏ దర్శకుడి కి కూడా లేదనే చెప్పాలి.

ఆయన ప్రతిభకు ఉదాహరణగా ఈ చిత్రంలోని ఓ పాటను చెప్పుకోవాలి. ఆ చిత్రం లోని పాట కోసం ఆయన ఏడు వింతలను చూపించి పాట యొక్క స్వరూపాన్ని సినిమా స్థాయిని మార్చేశాడు. ఒక కొత్త హీరో హీరోయిన్లకు ఇలాంటి ఎలివేషన్ ఇవ్వడం అంటే అది కేవలం శంకర్ కు మాత్రమే సాధ్యం అని చెప్పాలి. తన ప్రతి సినిమా లో భారీ తనం ఉండేలా చేసుకున్నాడు శంకర్. అందుకే భారీ సినిమా ల దర్శకుడి గా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇక  ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ రూపాయలతో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా లోనీ ఈ పాట కోసం శంకర్ భారీగా ఖర్చు చేస్తున్నారట. 80 మంది ఫారిన్ డ్యాన్సర్ లను పిలిపించి వారితో పాటు లోకల్ డాన్సర్ లను కూడా పెట్టుకొని భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో ఈ పాటను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా లో ఈ పాట హైలెట్ అయ్యే లా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం తమన్ సమకూరుస్తున్నారు. కీయర అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: