టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎప్పటికప్పుడు కొత్త రక్తం రావాలి. దర్శకుల విషయంలో ఈ కొత్త వారు రావడం అనేది చాలా ముఖ్యమైనది. కొత్త కొత్త ఆలోచనలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. తద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు మంచి సినిమా లు వచ్చి ప్రపంచ స్థాయి లో గుర్తింపు దక్కించుకుంటుంది. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమకు దూసుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. రావడం రావడంతోనే ఆయన తాను స్టార్ హీరో అయ్యే మెటీరియల్ అని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు.

 ఆయన తొలి సినిమా అ! చిత్రంతోనే తాను రెగ్యులర్ సినిమాలు చేసే దర్శకుడిని కాదు ప్రేక్షకులను మెప్పించే సరికొత్త లోకం లోకి తీసుకు వెళ్ళే సినిమాలను తెరకెక్కించే దర్శకుడు చాటి చెప్పుకున్నాడు. తొలి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఆ చిత్రం ప్రశాంత్ వర్మ కు మంచి పేరు తీసుకు వచ్చిందని చెప్పాలి. వెరైటీ స్క్రీన్ ప్లే విభాగంలో ఆయనకు మంచి ప్రశంసలు దక్కాయి. నాని నిర్మించిన ఈ సినిమా వల్ల ఆయన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

ఇక ప్రశాంత్ వర్మ ఈ చిత్రం తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా చేశాడు. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా చేసిన జాంబీ రెడ్డి చిత్రానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. తెలుగులో తొలి జాంబీ చిత్రం గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఎంతో ఎంటర్ టైన్ చేయగా దానికి మంచి అందరినుంచి మంచి కాంప్లిమెంట్ కూడా లభించింది.  ప్రస్తుతం తేజ సజ్జ తో హనుమాన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. తొలి ఇండియా సూపర్ హీరో ఫిల్మ్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: