టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ స్టార్ దర్శకుడిగా ఉన్నాడు వి.వి.వినాయక్. 2002 వ సంవత్సరంలో ఆది సినిమాతో దర్శకుడిగా మారి మాస్ కమర్షియల్ కామెడీ చిత్రాలను రూపొందించడంలో ప్రేక్షకుల వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. తొలి సినిమాతోనే భారీ హిట్ సాధించడంతో వివి వినాయక్ కు ఎదురు లేకుండా పోయింది. ఆయనతో ఓ సినిమా చేయాలని అందరు హీరోలు కూడా ఎంతో ఆసక్తి గా ముందుకు వచ్చారు.

అలా ఆయన తన కెరీర్ లో చేసిన మొదటి సినిమాతోనే నంది అవార్డును అందుకొని నంది ఉత్తమ నూతన దర్శకుడు గా ఆయన గొప్ప పేరు పొందా రు. ఈ చిత్రం ప్రేక్షకుల అందరిని ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కూడా సాధించి పెట్టింది. తమిళంలో జై అనే పేరుతో ఈ సినిమా అక్కడ కూడా విడుదల కాగా దానికి కూడా ప్రేక్షకుల నుంచి ఎంతగానో రెస్పాన్స్ వచ్చింది. 

ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఠాగూర్ లక్ష్మీ కృష్ణ అదుర్స్ వంటి హిట్ చిత్రాలను చేసి ప్రేక్షకులను భారీగా మెప్పించాడు. ఈ సినిమాలు ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తీసుకు వచ్చాయి అని చెప్పాలి. వినాయక్ ఉన్న టైం లో టాలీవుడ్ లో పెద్దగా మాస్ దర్శకులు లేకపోవడం తో ఒక్కసారిగా ఆయన మాస్ దర్శకులకు మార్గదర్శకుడు గా నిలిచాడు. ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు వినాయక్.  అక్కడ ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి అనే సినిమా ను తెరకెక్కిస్తున్నారు. కెరీర్ మధ్య లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వి.వి.వినాయక్ ను మధ్య లో కొంతమంది హీరో లు దూరం పెట్టారు. మరి ఇప్పుడు బాలీవుడ్ లో చేసే ఈ సినిమాతో మళ్లీ పూర్వవైభవం అందుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: