చిరంజీవి బాలకృష్ణల మధ్య గ్యాప్ ఉంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. గతంలో అనేకసార్లు చిరంజీవి బాలకృష్ణల సినిమాలు పోటాపోటీగా విడుదలైన సందేర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వీరిద్దరి సినిమాలు విడుదలైనప్పుడు వీరి అభిమానుల మధ్య ఒక వార్ జరుగుతూనే ఉండేది.


ఇప్పటికీ ఆ గ్యాప్ వీరిద్దరి మధ్య కొనసాగుతున్నప్పటికీ వీరిద్దరూ ఏదైనా ఫిలిం ఫంక్షన్ లో కాని లేదంటే పెళ్ళిళ్ళలో కానీ కలిసినప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అన్న సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాస్తవానికి చాల కాలం వరకు అల్లు అర్జున్ కు మెగా కాంపౌండ్ హీరోగానే గుర్తింపు కొనసాగుతూ ఉండేది.


అయితే కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ హీరోగా కాకుండా అల్లు కాంపౌండ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కొనసాగిస్తూ తన అభిమానుల పేరును ‘అల్లు ఆర్మీ’ గా మార్చి ఏకంగా మెగా కాంపౌండ్ కు షాక్ ఇస్తున్నాడు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే తన కట్టె కాలేవరకు తాను చిరంజీవి అభిమానిగానే కొనసాగుతాను అంటూ మెగా అభిమానుల నుండి నిరశన రాకుండా చూసుకుంటున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు అల్లు అర్జున్ ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి ఈ ఫంక్షన్ కు జూనియర్ అతిధిగా వస్తాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే అతడు కాకుండా ఇప్పుడు అతడి స్థానంలో బన్నీ రావడం అనేక సందేహాలకు తావు ఇస్తోంది. ఇప్పటికే ఆహా లో ప్రసారం అవుతున్న ‘అన్ ష్టాపబుల్’ షో ద్వారా బాలకృష్ణకు అల్లు కాంపౌండ్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు ‘అఖండ’ తో ఈ సాన్నిహిత్యం మరింత పెరిగి భవిష్యత్ లో బన్నీ బాలయ్యల మల్టీ స్టారర్ రావడానికి ఈ సాన్నిహిత్యం పునాది వేస్తుందా అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: