రానున్న రెండు మూడు నెలలు సినీ అభిమానులకి పండగనే చెప్పాలి. ఎందుకంటే ..ఒక సినిమా తరువాత మరొకటి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక అవి కూడా బడా సినిమాలు కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమాల రికార్డులని తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నడు లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫిస్ దగ్గర తక్కువ టైం గ్యాప్ తో రిలీజ్ కానుండడంతో అటు అభిమానుల్లోను ఇటూ ప్రొడ్యూసర్స్ లోను ఏదో తెలియని భయం స్టార్ట్ అయ్యింది.

ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిని సినిమా "ఆర్ ఆర్ ఆర్". దాదాపు మూడు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను తెర పై చూడడానికి ప్రేక్షకులతో పాటు.. బడా స్టార్స్ కూడా వెయిత్ చేస్తూ ఉండడం గమనార్హం. దర్శక ధీరుడు గమనార్హం  తెరకెక్కించిన ఈ సినిమా "రణం రౌద్రం రుధిరం " గా మన ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఈ రెంజ్ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్  అందుకోవడానికి కారణం.. ఇద్దరు బడా హీరోలు. మెగా పవర్ స్టార్ రాం చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. వీళ్లిద్దరు కలిసి మల్టీ స్టార్ మూవీ చేస్తారు అని కలలో కూడా ఊహించి ఉండరు అభిమానులు. అలాంటి ఓ క్రేజీ కాంబో ని సెట్ చేసి..దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ గిఫ్ట్ గా ఈ సినిమాని జనవరి 7న గ్రాండ్  గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమైయ్యారు.

కాగా, రీసెంట్ గా ఈ సినిమా గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఆ  నెటిజ‌న్ ఏం అడిగారో తెలుసా..? "మావా..ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉందా..?"  అని డైరెక్ట్ గా ఆర్ ఆర్ ఆర్  చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇక్కడ  షాకింగ్ ఏమిటంటే దీనికి  చిత్ర బృందం రియాక్ట్  అవ్వడం. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ "ఏ నువ్వు చేస్తావా" అంటూ ఫ‌న్నీ గా రిప్లై ఇచ్చారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR