జెనీలియా.. ఈ పేరుని మనం మర్చిపోగలమా.. చెప్పండి..! తన అందంతో.. నటనతో.. అల్లరితో .. మన గుండెల్లో టాప్ ప్లేస్ ను సంపాదించుకున్న హీరోయిన్. నిజానికి జెనీలియా చేసింది తక్కువ సినిమాలే అయినా.. చేసిన ప్రతి సినిమాలో తన మార్క్ ను చూయించింది. ముఖ్యంగా "బొమ్మరిల్లు" సినిమాలో ఆమె చేసిన హాసిని పాత్ర ఇప్పటికి మనం టీవీలలో చూస్తుంటే ఎంతో సరదాగా అనిపిస్తుంది. తన అల్లరి, తన చలాకి తనంతో మంచి మంచి అవకాశాలు అందుకున్న ఈ మాజీ హీరోయిన్ జెనీలియా.. మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితీష్ దేశ్‌ముఖ్‌ ను ప్రేమించి పెళ్లాడింది. వీరిద్ద‌రు క‌లిసి తుజే మేరీ క‌స‌మ్ అనే సినిమా చేసారు.

సినిమా తెలుగులో వ‌చ్చిన నువ్వే కావాలి సినిమాకు రీమేక్‌ కావడం విశేషం. ఇక ఈ  సినిమా టైంలోనే షూటింగ్ లో న‌టిస్తూ అలా అలా  ప్రేమ‌లో ప‌డి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన జెనీలియా..ఓ వైఫ్ గా ఓ తల్లిగా తన బాధ్యతలను నిర్వహిస్తుంది. అమ్మడు సినిమాలు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం యయ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన భర్త,పిల్లలకు సంబంధించిన  వీడియోలను పోస్ట్ చేస్తూ నెట్టింట ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక రీసెంట్ గా జెనీలియా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా జెనీలియా తన పెద్ద కొడుకు రియాన్‌ బర్త డే సంధర్భంగా ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది. తన కొడుకు ఏడో పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో విషెస్ చెబుతూ.. తన కొడుకుతో ఉన్న ఫోటో షేర్ చేసి ఎమోషనల్  పోస్ట్ పెట్టింది. " నా ప్రియమైన కొడుకు రియాన్‌! నీ చిట్టి బుర్రలో ఎన్నో ఆశలు,  బోలెడన్ని కోరికలు ఉంటాయి కదా. వాటిని నేను  కచ్చితంగా నెరవేరుస్తా. నీ పుట్టిన రోజు నాడే నేను  మాటిస్తున్నాను రియాన్‌.  నువ్వు ఎప్పుడు ఫస్ట్ రావలి అని నేను అనుకోను .. లాస్ట్ వచ్చినా కూడా నీ వెంట నేను ఉంటా. నీలోని టాలెంట్ ని నేను గుర్తిస్తా.  నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను అవ్వలేను కానీ..ఖచ్చితంగా ఆ రెక్కల కింద గాలిని అవుతా. ఎప్పుడూ నీతోనే ఉంటా..నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తా. హ్యాపి బర్త డే రియాన్‌. ఐ లవ్‌ యూ మై  బ్రేవ్‌ బాయ్‌.” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఓ తల్లిగా తన బిడ్డ పై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్‌ నెటిజన్ల హృదయాలను హద్దుకుంటోంది.  
మరింత సమాచారం తెలుసుకోండి: