అఖండ మూవీ ఇపుడు హడావుడి చేస్తోంది. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి రావాలని బాలయ్య చూస్తున్నారు. ఆయంకి బోయపాటికీ కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ కొంత బ్యాడ్ పీరియడ్ ని ఫేస్ చేస్తున్నారు.

దాంతో అఖండను చాలా జాగ్రత్తగా చేసుకొచ్చారు. అన్ని అంశాలు మేళవించారు. నవరసాలూ అందులో ఉన్నాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గ్రాండ్ సక్సెస్  కోసం తెర ముందూ వెనకా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా దాకా ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
 
బాలయ్యకు బ్లాక్ బస్టర్ దక్కి చాలా కాలం అయింది. దాంతో ఈసారి కచ్చితంగా బాలయ్య హిట్ కొట్టాల్సిందే అన్న కసి ఒక సామాజికవర్గంలో ఉందిట. దానికి వర్తమాన రాజకీయం సామాజిక ఇతరత్రా కారణాలు అన్నీ కలగలసి ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి జై బాలయ్య అంటూ ఆయన్ని ముందు పెట్టి అఖడమైన విజయం కోసం వీర లెవెల్ లో బాలయ్య ఫ్యాన్స్ ప‌నిచేస్తున్నారు. తొలి షో నుంచే అదిరిపోయే టాక్ ని తీసుకురావాలని చూస్తున్నారు.

అఖండ మూవీ బాగానే ఉంటుంది. ఫ్యాన్స్ కి నచ్చుతుంది అని ఇన్నర్ టాక్. అలాగే ఈ మూవీ చాలా కాలంగా పెద్ద సినిమాలు చూడలేని ఆడియన్స్ కి కూడా విందు భోజనం లాంటిదే. సరైన టైమ్ లో దించడం ప్లస్ పాయింట్. ఇక టాక్ ఏ మాత్రం బాగున్నా మూవీ సూపర్ హిట్ కావడం ఖాయమనే అంటున్నారు. మొత్తానికి బాలయ్య అఖండకు ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
















మరింత సమాచారం తెలుసుకోండి: