టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎక్కడా తగ్గడంలేదు. తమ స్టార్ డమ్ ని ఉపయోగించుకుని వారు సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. అదే వరసలో మరో సీనియర్ హీరో ఉన్నారు. ఆయన ఇపుడు కొంత ఇబ్బందులో ఉన్నారు.

అయితే ఆయనేమి తక్కువ కానే కాదు. ఆయన 1980 దశకంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో తన సత్తా చాటారు. ఆయన కూడా చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలతో సరిసమానంగా స్టార్ డమ్ ని అప్పట్లో అనుభవించారు. అయితే ఆయన ఒక దశలో ఎంచుకున్న సినిమాలు సరిగ్గా ఆడకపోవడం. బ్లాక్ బస్టర్ అవుతాయనుకున్న సినిమాలను ఆయన వదులుకోవడంతో కెరీర్ లో ఇబ్బందులను చూశారు.

అయినా సరే ఒక్క హిట్ పడితే చాలు మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వచ్చేస్తాను అంటున్నారు. రాజశేఖర్ ఇపుడు మొత్తం ఎనర్జీ అంతా పెట్టి శేఖర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీతో తన దశ తిరుగుతుందని భావిస్తున్నారు. మూడక్షరాల ఈ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను జీవిత డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్ రీసెంట్ గా వదిలారు. అందులో రాజశేఖర్ ఓల్డ్ లుక్ లో బాగున్నాడు అనిపించాడు. ఇక పవర్ ఫుల్ డైలాగులతో టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎమోషన్స్ తో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ మూవీ రిలీజ్ అయితే రాజశేఖర్ కెరీర్ లో చాన్నాళ్ల తరువాత ఒక సూపర్ హిట్ వస్తుందని అంతా అంటున్నారు. దీని తరువాత సినిమాలను కూడా రాజశేఖర్ లైన్ లో పెట్టి ఉంచారుట. మొత్తానికి ఒకనాటి  యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కి హిట్ పడాలని అంతా కోరుకుంటున్నారు. సరైన సబ్జెక్ట్ పడాలి కానీ రాజశేఖర్ విశ్వరూపమే చూపిస్తాడు అంటారు. అలాంటి మూవీయే శేఖర్ అని టాక్ అయితే ఉంది మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: