ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా లక్కీ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. అయితే శరవేగంగా సాగుతున్న పుష్ప సినిమా తరువాత బన్నీ వకీల్ సాబ్ దర్శకుడు అయిన వేణు శ్రీరామ్ తో కలిసి మరో సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాకి ఐకాన్ అని సినిమా టైటిల్ ని కూడా ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడో ఓపెన్ డాన్స్ చేశారు కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఏ వార్త లేదు.

అయితే వీటి తర్వాత వేణు శ్రీరామ్ తోనే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా బన్నీ మరో సినిమా చేయనున్నారు. అయితే ఇద్దరి దర్శకులతో నే కాకుండా బన్నీ దర్శకుల లిస్టులో మరో దర్శకుడి పేరు చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్తో కలిసి తెరకెక్కిస్తున్న సినిమా రాదే శ్యామ్. అయితే ఈ దర్శకుడుతో కూడా కలిసి ఒక సినిమా చేయనున్నారట అల్లు అర్జున్. అయితే అప్పట్లో గోపీచంద్ నటించిన ఈ సినిమాతో ఈ దర్శకుడు మంచి హిట్ ను అందుకున్నారు. అయితే దాని తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రభాస్తో కలిసి రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది.

 దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే వీరందరి తో పాటు బోయపాటి కూడా బన్నీతో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సరైనోడు సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది.పుష్ప సినిమా హీరో బన్నీ తో కలిసి సినిమా చేయాలని ఎంతో మంది దర్శకులు క్యూ కడుతున్నారు మరి ఇవన్నీ దర్శకుడితో కలిసి నెక్స్ట్ సినిమా చేస్తాడో చూడాలి మరి. ఇకపోతే బన్నీ తాజాగా చేస్తున్న చిత్రం పుష్ప ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్నప్పటికీ మొదటి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: