మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే, ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసి గాడ్ ఫాదర్ మరియు బోలా శంకర్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు, మరియు బాబీ దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటించడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీగా ఉన్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పటికీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ సి 15  సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది, ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతుంది.

 ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ప్రశాంత్  నిల్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో రామ్ చరణ్, ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో  సినిమా చేయబోతున్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా  ప్రశాంత్ నీల్ ఒక సినిమా తీయబోతున్నట్లు, ఆ సినిమాలో చిరంజీవి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో చిరంజీవి రామ్ చరణ్  కలిసి నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: