ప్రస్తుతం పవర్ స్టార్ తో పోటీ అంటేనే స్టార్ హీరోలు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే పవన్ క్రేజ్ అలాంటిది మరి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజే మరో సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు రావడం ఖాయమే అని చాలా మంది అంటుంటారు. ఇక పవన్ సినిమా రిలీజ్ సమయానికి మీడియం రేంజ్ హీరో సినిమా అంటే అసలు కనిపించే ఛాన్సే ఉండదు. ఒకవేళ అగ్రహీరో అయ్యుండి భారీ బడ్జెట్ సినిమా అయితే అని డిసైడ్ చేసుకొని పోటీలు దిగాలి. లేదా ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత గానీ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేసుకోవాలి. అందుకే సంక్రాంతి రేసు నుంచి పవన్ కళ్యాణ్ ని తప్పించేందుకు ఆర్ఆర్ఆర్ నిర్మాతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

 ఎందుకంటే సంక్రాంతి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఆర్ఆర్ఆర్ కు గట్టి పోటీ ఇస్తుంది. అందుకే ఎలాగైనా పవన్ ను తమ సినిమా వాయిదా వేసుకోమని ఇప్పటికే రాజమౌళి టీం కోరుతోంది. కానీ వారు చేసే ప్రయత్నాలు విఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా ఇదే రోజున తమిళ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న 'వాలిమై' సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మించారు. మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం.

 అంతేకాదు కార్తికేయ కు ఇది తమిళ్ డెబ్యూ మూవీ. అందుకే ఒకేరోజు తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేశారు. అయితే తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడకుండా కాస్త గ్యాప్ తో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. అయితే తమిళంలో మాత్రం జనవరి 12 నే ఈ సినిమా విడుదల కానుందట. ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో బాలీవుడ్ హిట్ మూవీ పింకి రీమేక్ గా తెరకెక్కిన నేర్కొండ పార్వై  సినిమా మంచి విజయం అందుకుంది. దీంతో ఇప్పుడు వస్తున్న వారిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: