నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అవుతున్న మొట్టమొదటి పెద్ద సినిమా అఖండ కావడంతో ఈ సినిమా ఫలితం తో పాటు కలెక్షన్స్ పై కూడా ఇండస్ట్రీ పెద్దలు దృష్టిసారించారు. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన అఖండ సినిమా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న తక్కువ టికెట్ రేట్లతో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

 అదేంటంటే అఖండ సినిమాలో కొన్ని పొలిటికల్ సెటైర్లు కూడా ఉంటాయని సమాచారం వినిపిస్తోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా ఆఖండ రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఏకంగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నాడు.ఇక దీనికితోడు ఇప్పుడు సినిమాలో పొలిటికల్ సెటైర్స్ ఉండబోతున్నాయని తెలియడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపు అయింది. కొన్ని నెలల క్రితం ఏపీ లోని కొన్ని హిందూ దేవాలయాల పై విగ్రహాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అఖండ సినిమాలో ఈ దాడులకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందని..

ఈ అంశం ద్వారానే బాలయ్య సినిమాలో పొలిటికల్ సెటైర్లు పేల్చబోతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో వున్న ఈ వార్తలో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే ప్రచారం కనుక నిజమైతే ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి పొలిటికల్ సెటైర్స్ వేస్తారో చూడాలి. ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలయ్య ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్, అఘోర పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: