లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా అందం, అభినయం, ఆకర్షణ, అదృష్టం ఇలా అన్నింటి కలబోతగా నయనతార మనకు దర్శనమిస్తుంది.. గ్లామర్ పరంగా కొన్ని సినిమాలు నెట్టుకు వచ్చినప్పటికీ ..గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళుతోంది. ఇక తెలుగు ,తమిళ భాషలలో వరుస సినిమాలు చేసుకుంటూ అదృష్టం బాగుంటే మంచి పాత్రలు కూడా పెడుతూ ఉంటాయి. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం కాకుండా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.


అంతేకాదు ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించి, ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈమె ప్రభుదేవా తో ప్రేమలో పడి బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్  తో ప్రేమలో పడి త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ మధ్యనే విఘ్నేష్ శివన్  తో నిశ్చితార్థం చేసుకున్న నయనతార , తాజాగా తన భర్తతో కలిసి ఉండడానికి ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట.


అత్యంత ధనికులు మాత్రమే నివసించే పోయేస్ గార్డెన్ లో ఫోర్  బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాదు ఈ ప్లాట్ కొన్ని కోట్ల రూపాయల ఖరీదు చేస్తోందని.. చూడడానికి కళ్ళు చెదిరిపోయే లా ఉందని .. ఎంతో అద్భుతంగా ఉందట. ఎలాంటి అండా దండా లేకుండా ఇండస్ట్రీలోకి సుదీర్ఘకాలంపాటు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు పేద స్థాయి నుంచి వచ్చిన నయనతార కొన్ని కోట్లు పెట్టి తన నివాస స్థానాన్ని సంపాదించుకోగలిగింది..అంటే ఈ స్థాయికి చేరడం నిజంగా విశేషమే అని చెప్పాలి. ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తున్న ఈమె తెలుగు మలయాళం ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టిందని సమాచారం. అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా పరిచయమయ్యే పనిలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: