ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయమే ఆ దిగ్భ్రాంతికర వార్త సదరు డైరెక్టర్ ను చేరుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే... టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లోనే ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీనువైట్లకు ఈరోజు ఉదయం పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు. వయసు 83 ఏళ్ళు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్యంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కృష్ణారావు ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో కన్ను మూసినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివాసం ఉంటున్న కృష్ణారావు గత కొన్ని రోజులుగా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుడిగా తనకంటూ ఓ పేరును తెచ్చుకున్న శ్రీనువైట్ల చివరగా రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` చిత్రాన్ని తెరకెక్కించారు. మూడేళ్ళ క్రితం భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇటీవల కాలంలో సినిమా జీవితంలో ఒడిడుకులు ఎదుర్కొంటున్న శ్రీనువైట్ల 'నీ కోసం' సినిమాతో 1999లో రవితేజ హీరోగా టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తరువాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని పట్టేశారు. ఆనందం, సొంతం, ఢీ, దుబాయ్ శీను, వెంకీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్షా, ఆగడు వంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల ఢీ అంటే ఢీ అనే సినిమాను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: