నందమూరి అభిమానులు అందరూ యువరత్న బాలకృష్ణతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల‌ను ఒకే వేదికపై చూడాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తూ వస్తున్నారు. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఫంక్షన్లో మాత్రమే వీరిద్దరు కలిసి కనిపించారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే. వీరిద్ద‌రు క‌లిసి క‌న‌పించేందుకు స‌రైన టైం కూడా సెట్ కావడం లేదు.

ఇక ఇండస్ట్రీలో వరుసగా రాబోతున్న సినిమాలు అన్ని హిట్ అవ్వాలని బాలయ్య ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - మ‌రియు మ‌న ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు బన్నీ నటించిన పుష్ప... చిరంజీవి నటించిన ఆచార్య‌ సినిమా అని కూడా విజయాన్ని సొంతం చేసుకోవాలని వారికి ముందుగా తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే బాల‌య్య మాట్లాడిన మాటలను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాలయ్య నోట మ‌న ఎన్టీఆర్ మాట వచ్చిన వెంటనే శిల్పకళావేదికలో ఉన్న వారందరూ కూడా జై ఎన్టీఆర్ అంటూ గట్టిగా అరిచారు . ఇక ఎన్టీఆర్ ఈవెంట్లో పాల్గొంటారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఈ ఈవెంట్ కు రాలేదు.

మరి సినిమా హిట్ అయ్యాక స‌క్సెస్ మీట్‌కు అయినా ఎన్టీఆర్ వస్తాయేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో న‌టించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వ‌చ్చే జ‌న‌వ‌రి 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తారు. ఆ త‌ర్వాత కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించే సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడు. ఆ రెండు సినిమాల త‌ర్వాత మాట‌ల మాంత్రి కుడు త్రివిక్ర మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: