యువరత్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అఖండ కచ్చితంగా సూపర్ హిట్ అవడంతో పాటు వీరి కాంబోలో హ్యాట్రిక్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాకు సంగీతం అందించిన థ‌మన్ మాట్లాడుతూ ముందుగా కార్యక్రమానికి వచ్చిన‌ వారితో పాటు రాజమౌళి గారికి తాను ధన్యవాదాలు చెబుతున్నాను అని చెప్పాడు.

తాము ఏడాదిన్నరపాటు శివుడి ట్రాన్స్ లో ఉన్నామని... ఇండస్ట్రీకి బాలయ్య శివుడు లాంటి మనిషి అని ఆయన నుంచి మాకు చాలా ఎనర్జీ వచ్చిందని చెప్పాడు. గత 48 రోజులుగా తాను అఖండ సినిమా గురించి తప్ప మరే దీని గురించి ఆలోచించలేదని ... బోయపాటి గారికి ఎక్కడ ఉప్పు ఎక్కువ వేయాలి ఎక్కడ కారం క‌రెక్టు గా వేయాలనేది బాగా తెలుసు అని చమత్కరించాడు.

అలాగే ఈ సినిమా చూస్తున్న వారంతా థియేటర్లలో కుర్చీలో కూర్చుని సినిమా చూడ‌ర‌ని.. నుంచునే చూస్తార‌ని చెప్పాడు. థియేట‌ర్ల లో 70 సీట్లు ఉంటే ఓ 50 మంది మాత్రం కుర్చీల్లో నుంచి పైకి లేచి మ‌రీ అఖండ చూస్తార‌ని థ‌మ‌న్ చెప్పాడు. ఇక ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా లో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఓవ‌ర్సీస్ లో  ఈ సినిమా 500 స్క్రీన్ల లో రిలీజ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: