బాహుబలి..ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చెప్పిన సినిమా. ఈ సినిమాతోనే దర్శకుడు రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన త్యాగాలు మర్చిపోలేనివి. అంతేకాదు ఖండల వీరుడు రానా ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. ఇక సూపర్ హిట్ జోడి..అనుష్క ప్రభాస్ ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించి అభిమానుల కోరికను తీర్చారు. తెర పై ఈ జంట ను చూసి అభిమానులు ఎంతో ఆనందపడ్డారు.

ఇలా ఈ సినిమాలో ఒక్క హీరో,హీరోయిన్ లే కాదు చిన్న క్యారెక్టర్స్ చేసిన ప్రతి నటుడు గుర్తుండిపోయేలా ఆ పాత్రను తెరకెక్కించారు రాజమౌళి. అందుకే సినిమా అంతా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా గురించి నటుడు సుబ్బరాయ శర్మ షాకింగ్ కామెంట్స్ చేసారు.  ఆయన బాహుబలి సినిమా గురించి మాట్లాడిన మాటాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక్కప్పుడు సినిమాలో సుబ్బరాయ శర్మ కీలక పాత్రల్లో నటించేవారు. ఈయన దాదాపు 250కు పైగా సినిమాలో నటించారు. హీరోయిన్ కు తండ్రిగా, విలన్ గా, సహ నటుడిగా ఇలా ఈయన తనదైన స్టైల్లో నటించి అభిమానుల గుండెల్లో ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు.

 1947 లో జనవరి 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించాడు సుబ్బరాయ శర్మ. ఈయన తల్లిదండ్రుల పేర్లు  దుర్గా ప్రసాద రావు, సుందరి. సుబ్బరాయ శర్మ.. జ్ఞానప్రసూనాంబ అనే అమ్మాయిను  వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఒకానొక సమయంలో కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉన్న ఈయనకు సడెన్ గా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఈయన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ.. "సినిమాలో మన పాత్ర బాగా పండినా..సినిమా ఫ్లాప్ అయితే మనకు ఏం లాభం ఉండదని చెప్పుకొచ్చారు. చాలా మంది సినీ ఇండస్ట్రీలో వర్గ వివక్ష ఉంటుందని  అనుకుంటారు అని..కానీ అది నిజం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. టాలెంట్ ఉంటేనే ఏ రంగంలోనైనా నెట్టుకురాగలము అని చెప్పారు. నిజానికి బాహుబలి సినిమాలో నాకు మంత్రి వేషం ఇచ్చారు అని, కానీ నా భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కేవలం మూడు రోజులకే ఆ సినిమా నుండి బయటకి వచ్చేసాను " అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: