సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాతో  పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలు గా వస్తున్న విషయం తెలిసిందే. ఇక తోటి హీరోలు ఎప్పుడో ఈ పాన్ ఇండియా సినిమా మార్కెట్ లోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంటూ ఉండగా అల్లు అర్జున్ మాత్రం కొంత లేటుగా ఈ ప్రయత్నం మొదలు పెట్టాడు అని చెప్పవచ్చు.

తెలుగు లో  సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతూ ఉన్న బన్నీ ఇప్పుడు అదే లెవెల్ లో ఈ సినిమా ను హిట్ చేయాలని చెప్పి ఆసక్తికరంగా ఈ సినిమా కథను మలిచారట. ఇప్పటికే బన్నీ కి రెండు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు ఉండటం ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండడానికి కారణం. ఇక అల్లు అర్జున్ ఈ మార్కెట్లోకి రావడం ఆయన అభిమానులకు ఎంతగానో కిక్ ఇస్తుంది. దాంతో ఈ మార్కెట్లో ఆయన ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా ఆయన మరిన్ని మంచి సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు చేసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తూ ఉండగా మరోవైపు ఆయన మరో ఇద్దరు పెద్ద దర్శకులతో సినిమాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు అనౌన్స్ అవుతాయో చూడాలి. ఆయా దర్శకులు సినిమాలు పూర్తి చేసే సరికి చాలా సమయం పడుతుంది.. ఈనేపథ్యంలో బన్నీ ఈ గ్యాప్ లో బోయపాటి శ్రీను సినిమా చేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: