ఏపీలో ఇటీవలే ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి తెలుగు సినిమా పరిశ్రమ లో ఎన్నో రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత మంది అడిగినా కూడా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపించకపోవడంతో అందరూ ఏం చేయాలో అన్న ఆలోచనలో పడ్డారు. తాజాగా దీనిపై నిర్మాత సురేష్ బాబు గట్టిగానే స్పందించాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన గత రెండు సినిమాలను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా విడుదల చేశారు.

వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఓ టీ టీ లో విడుదల అయ్యాయి.  అయితే ఆయన చేతిలో ఎన్నో థియేటర్లు ఉన్నాయి కానీ ఆయన సినిమాలను థియేటర్లలో ఓ టీ టీ లో విడుదల చేయడం ఒక్క సారిగా ఆయన పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమాలే కాదు భవిష్యత్తులో కూడా ఆయన చేస్తున్న తన సినిమాలను ఓ టీ టీ కే కూడా ఇచ్చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే దీనిపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చి అందరి అనుమానాలను క్లియర్ చేశాడు.

అవును నా నిర్మాణంలో రాబోయే చిత్రాలు కూడా ఓ టీ టీ కే ఇచ్చేశాను అని ఆయన చెప్పారు. దానికి ముఖ్యకారణం ఏపీలో టిక్కెట్ల రేట్లు సమస్య అని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఏపీలో ఏ క్లాస్ లో టికెట్ రేటు వంద రూపాయలు అంటే పర్వాలేదు కానీ బి సి సెంటర్లలో మరి 20,30 రూపాయలు అంటే చాలా కష్టం అవుతుంది. ఇది సరైన నిర్ణయం కాదు అని అంటారు.  ప్రభుత్వం లో ఎక్కడో మిస్ కమ్యుని కేషన్ జరుగుతుంది. ఈ 15 నెలల కాలంలో మాకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంటు బిల్లులు కూడా రద్దు చేయలేదు. థియేటర్లో పనిచేసే గురించి కూడా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ వేరు కానీ ఆడియన్స్ టేస్ట్ రోజురోజుకు మారిపోతుంది. అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను అని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: