మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం టాలీవుడ్ లో మూడు సినిమాలు ఒకేసారి తెరకెక్కుతున్నాయి. ఆయన హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా చేసిన ఆచార్య చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కాబోతుండగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.  ఇకపోతే ఈ చిత్రం విడుదలైన కొన్ని నెలల వ్యవధిలోనే చిరంజీవి నటించిన మరో చిత్రం విడుదల అవుతుండటం విశేషం.

ఆయన కెరీర్ లో 153వ చిత్రంగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా కాగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ చిత్రం లో భారీ మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను విలన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. 

ఇప్పటికే కేజిఎఫ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్న సంజు బాయ్ ఆ సినిమా తో సౌత్లో ప్రేక్షకులకు బాగా ఎక్కేస్తాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి పక్కన ఆయన ను విలన్ గా తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని భావించి ఈ చిత్ర నిర్మాతలు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. అప్పుడెప్పుడో నాగార్జున చంద్రలేఖ సినిమా లో తెలుగులో నటించిన ఆయన ఇప్పుడు మళ్లీ నటించడం అందరినీ ఆసక్తిని లేపుతుంది. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నయనతార నటిస్తుండగా సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: