తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ గీత రచయితల లో ఒకరు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి వెన్నెల సినిమాతో గీత రచయితగా పరిచయమైన ఆయన మూడు తరాల సంగీత దర్శకుల తో పని చేసి ఎవరికీ దక్కని అదృష్టాన్ని అందుకున్నాడు. తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఎన్నో మధురమైన గీతాలను అందించిన సీతారామశాస్త్రి ఇప్పటివరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.

ఆయన తెలుగు కళామతల్లికి అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను కూడా అందించి ఆయనకు మంచి గౌరవాన్ని అందజేసింది.
తనకు తొలి అవకాశం ఇచ్చి ఈ స్థాయిలో నేను రావడానికి కారణమైన కె.విశ్వనాథ్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను ఆయన అప్పట్లో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాగే తాను సినీ రంగంలోకి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు. 

ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం మూడు నిమిషాలు ఉండే ఓ పాట లో సినిమా మొత్తం నింపడం అది కూడా అర్థమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి పాటలను రాయడంలో దిగ్గజాలైన మహానుభావులలో ఒకరు సిరివెన్నె ల సీతారామశాస్త్రి. తన సాహిత్యం తో కేవలం పాటలతో మాత్రమే ప్రాణం పోయడం కాకుండా సినిమా ను కూడా అర్థవంతంగా చూపించగలరు. అలాంటి పాటలు రాయగ ల ప్రతిభ ఉన్న మహానుభావులలో ఒకరు  సిరివెన్నెల సీతారామశాస్త్రి. విధాత తలపు న అంటూ మొదలైన ఆయన పాట ల ప్రవాహం నిర్విరామం  గా ఇప్పటికీ తెలుగునాట ప్రవహిస్తూనే ఉంది.  ఆయన తెలుగు సినిమాలలో రాసిన ప్రతి పాట కూడా ఆణిముత్యం వలే ఉంటూ ప్రేక్షకుడిని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: