ఆర్ఆర్ఆర్ సినిమాతో జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు జక్కన్న. ఆయన దర్శకత్వం లో రాబోతున్న రెండో పాన్ ఇండియా సినిమా కావడంతో ఒక్కసారిగా దేశం మొత్తం మరొకసారి రాజమౌళి వైపు చూస్తుంది. ఇటీవలే ఆయన ఈ సినిమాలోని ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాడు. తాజాగా సినిమా లోని పాటలు కూడా ఆయ న విడుదల చేశాడు. తెలుగులో మూడు పాటలను విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింతగా పెంచగా ఇటీవలే జనని అనే ఓ ఎమోషనల్ పాటను విడుదల చేశాడు.

ఈ పాట ఎంతో పెద్ద సూపర్ హిట్ కాగా తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఈ పాటను విడుదల చేశారు. దీనికి సంబంధించి చెన్నైలో ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి సినిమా విశేషాలను వెల్లడించారు రాజమౌళి.ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలు తెలపడంతో పాటు తమిళ మీడియాకు క్షమాపణ లు కూడా చెప్పారు. దానికి కారణం లేకపోలేదు ఒక పాన్ ఇండియా సినిమా చేస్తే తప్పకుండా అన్ని భాషల వారితో కాంటాక్ట్ లో ఉండాలి. తమ సినిమా విశేషాలను అన్ని భాషల వరకు అందేలా చూసుకోవాలి.

 కానీ జక్కన్న కేవలం తెలుగు హిందీ పరిశ్రమల పై మాత్రమే దృష్టి పెట్టి అక్కడ మాత్రమే పబ్లిసిటీ చేశారు. కానీ ఇతర భాష ల్లో పెద్దగా ప్రమోట్ చేయలేదు. అందుకే ఆయన తమిళ సినిమా ప్రేక్షకులకు సినీ ప్రియులకు క్షమాపణలు అంటూ ఈ వేదిక సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సినిమాను తమిళంలో నూ విడుదల చేస్తుండగా గత మూడు సంవత్సరాలుగా అందరికీ క్షమాపణలు అంటూ ఆయన సినిమా విశేషాలను వెల్లడించారు సినిమా విడుదలకు ముందు జరిగే ప్రమోషన్ లో తప్పకుండా తమిళ మీడియా కి ప్రత్యేక స్థానాన్ని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: