బాలీవుడ్, టాలీవుడ్ సినిమా పరిశ్రమలలో ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన హీరోలు. ప్రస్తుతం ఉన్న బడా చిత్రాలలో చాలా వరకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలే ఎక్కువగా సెట్స్ పైన ఉన్నాయి. మన హీరోలు స్పోర్ట్స్ ఆటగాళ్ల మారిపోతూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో క్రికెటర్స్ బయోపిక్ సినిమాలు తెరకెక్కుతు ఉండగా, ఫుట్ బాల్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ను టచ్ చేస్తూ కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాయి. 

అలా ఇండియన్ సినిమా లలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా 83. ఇండియన్ క్రికెట్ టీం ఫస్ట్ టైం ప్రపంచ కప్ అందుకున్న మధుర క్షణాలే బ్యాక్ డ్రాప్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. డిసెంబర్ 24 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ ముఖ్యపాత్రలో జెర్సీ సినిమాను చేస్తున్నాడు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఇక వుమెన్ సెన్సేషనల్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ తో తాప్సి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే భారతీయ క్రికెట్ కు ఎంతగానో ఫేమ్ తీసుకు వచ్చిన ఆటగాడు గంగూలీ బయోపిక్ కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  యువరాజ్ సింగ్, సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి వారి బయోపిక్ లు కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ ల కాంబో లో లైగర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుట్ బాల్ నేపథ్యంలో మైదాన్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో లక్ష్య మరియు గుడ్ లక్ సఖి అనే చిత్రాలు కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: