సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నడుస్తూ ఉండగా విలన్ పాత్రలో సముద్రఖని కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార  చిత్రాలను మిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేశాయి, ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ అద్భుతం గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావడం తో కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

 అయి తే ఆ తర్వాత అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నారు అని ప్రకటించడంతో సర్కారు వారి పాట చిత్ర బృందం ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాను కూడా ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇది నిజమే అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు పోటీ పడవలసిందే. మరి లైగర్ సినిమా ఏ తేదీలో విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: