గౌతమ్ ఎస్ ఎస్ సి మరియు చందమామ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో హీరో నవదీప్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడని అందరికి తెలుసు.. కొన్ని చిత్రాల్లో నవదీప్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడని తెలుస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నవదీప్ తరచుగా అభిమానులతో ఆసక్తికర అంశాలు షేర్ చేసుకుంటుంటాడట నవదీప్ కు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువేనట.

నవదీప్ ఎక్కడ కనిపించినా అందరితో జోవియల్ గా ఉంటాడట.తాజాగా నవదీప్ సరదాగా ఓ సెటైర్ వేసినప్పటికీ దానిపై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోందని తెలుస్తుంది.. ఏపీ టికెట్ ధరల సమస్య ప్రస్తుతం టాలీవుడ్ ని కలవరపెడుతున్న అంశమని అందరికి తెలుసు.. చిన్న చిత్రం అయినా అలాగే పెద్ద చిత్రం అయినా ఒకే టికెట్ ధర అంటూ ఏపీ ప్రభుత్వం తక్కువ రేట్లకే సినిమా టికెట్ ధరలు నిర్ణయించిందట. అలాగే ఆన్లైన్ టికెట్ విధానాన్ని కూడా తీసుకువస్తోందని పెద్ద చిత్రాలకు అదనపు షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

దీనితో టాలీవుడ్ నిర్మాతలకు ఇది పెద్ద సమస్యగా మారిందట దీనిపై నవదీప్ సోషల్ మీడియాలో సెటైరికల్ గా స్పందించాడట. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నవదీప్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడట. 'సినిమా టికెట్ వర్సస్ టమాటో' అంటూ నవదీప్ కామెంట్ పెట్టాడట.దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో సినిమా టికెట్ ధరలపై నవదీప్ ఎలాంటి సెటైర్ వేశాడో మరి 

ప్రస్తుతం టమాటో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టమాటో కొనాలంటే సామాన్యులు అల్లాడిపోతున్నారని ఏపీలో సినిమాలకు సింగిల్ టికెట్ ధర కిలో టమాటో ధరకంటే తక్కువగా ఉందని అంటూ నవదీప్ పరోక్షంగా తెలియజేశాడట. కాసేపటికే నవదీప్ ఈ ట్వీట్ ని డిలీట్ చేసినట్లు ఉన్నాడని తెలుస్తుంది.. సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ విధానాలని టాలీవుడ్ లో కొందరు వ్యతిరేకిస్తున్నారట.మరికొందరు ఏపీ ప్రభుత్వానికి రిక్వస్ట్ చేస్తున్నారట మిగిలిన వాళ్ళు సైలెంట్ గా ఉండడం ఆసక్తిగా మారిందని సమాచారం.

చిరంజీవి ఆన్లైన్ టికెట్ విధానాన్ని ప్రశంసిస్తూనే.. టికెట్ ధరలపై మాత్రం ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి అని సీఎం జగన్ కు ట్విట్టర్ వేదికగా విన్నవించారని తెలుస్తుంది.. టాలీవుడ్ సమస్యలపై అలాగే టికెట్ విధానాలపై జగన్ కు విన్నవించేందుకు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా నవదీప్ ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలకోసం ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది.ధృవ మరియు ఆర్య 2 లాంటి చిత్రాల్లో నవదీప్ పోషించిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.. నవదీప్ ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తూ కొత్త మేకోవర్ కోసం ట్రై చేస్తున్నాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: