ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కరోనాతో కన్నుమూశారని సమాచారం.తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ ఎన్నోఏళ్లుగా సేవలందించిన ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందట.

అసలు శివ శంకర్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎలా మారాడో ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయో అనేది తెలుసుకుందాం..

శివ శంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్‌ పెట్టించారట. దీంతో శంకర్‌ నేరుగా అయిదో తరగతిలో చేరారట. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదట. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారని అప్పట్లో 'సభ' అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేదట అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడని సమాచారం.. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ ను పంపేవారట . వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేయాలన్న పట్టుదల పెరిగిపోయిందని తెలుస్తంది 

దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారట. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయిందట. ఒక రోజు ఎవరో వచ్చి తాను డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారట. అబద్ధాలు చెప్పడం శివశంకర్‌ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదని అందుకే నిజం చెప్పేశారట చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారట 'తర్వాత ఏం చేస్తావు' అని శివ శంకర్‌ను అడిగారని . 'నేను డ్యాన్సు నేర్చుకుంటా' అని చెప్పారట.

ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్‌ జాతకం చూపిస్తే, 'డ్యాన్సర్‌ అవుతాడు అని వదిలెయ్‌' అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారట. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్‌ మాస్టర్‌ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారట.

'ధీర ధీర'కు జాతీయ అవార్డు
రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర'లో 'ధీర ధీర' పాటకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్‌ మాస్టర్‌ ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారట. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివ శంకర్‌ మాస్టర్‌ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు. 'నేనే రాజు నేనే మంత్రి', 'అక్షర', 'సర్కార్', 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' అలాగే , 'రాజుగారి గది 3' తదితర చిత్రాల్లో నటించి మెప్పించారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: