ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఎంతగానో  గుర్తింపు సంపాదించుకుంది బిగ్బాస్ కార్యక్రమం. కాగా ప్రస్తుతం బిగ్బాస్ 5 సీజన్ ప్రసారం అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే చూస్తూ చూస్తూండగానే ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. దీంతో ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరూ కన్ను కూడా బిగ్ బాస్ హౌస్ పైన ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు టాప్ ఫైవ్ లో నిలవ బోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.. దీని గురించే బుల్లితెర ప్రేక్షకులు అందరూ చర్చించుకుంటున్నారు.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో ఎలిమినేషన్ ల నుంచి తప్పించుకుంటూ ప్రస్తుతం హౌస్లో స్ట్రాంగ్ గా కొనసాగుతున్నారు సిరి, షణ్ముఖ్ జస్వంత్. అయితే హౌస్ లో వీరి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొన్నిరోజుల వరకు ప్రేక్షకులను ఆకర్షించింది. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మితిమీరిన హగ్గులు, కిస్సులు  ఉండటంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఒకానొక సమయంలో తప్పు అని తెలిసినప్పటికీ తాను షణ్ముఖ్ తో కనెక్ట్ అవుతున్నాను అని  సిరి చెప్పడం మరింత గా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటీవలే షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా.. సిరి ప్రియుడు శ్రీహాన్  బిగ్బాస్ రావడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.



 ముఖ్యంగా సిరి షణ్ముఖ్ మధ్య ఉన్న బంధం గురించి అటు సిరి ప్రియుడు శ్రీహాన్ మాట్లాడిన తీరు అందరిని ఆకర్షించింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల బిగ్బాస్ హౌస్ నుంచి ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు యాంకర్ రవి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా సిరి షణ్ముఖ  బంధం గురించి రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షణ్ముఖ్ దీప్తి సునైనా ను ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటుని ఎంత లవ్ చేస్తుందో  ఇద్దరికీ తెలుసు. అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా.. సిరి అతనితో లవ్ లో ఉందా అని అని అరియనా ప్రశ్నిస్తుంది.. అయితే సిరి అయితే అలాగే చెబుతుంది  నాతో చెప్పింది నేను అతనిని లైక్ చేస్తున్నాను అని అంటూ రవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మళ్లీ కొత్త చర్చకు తెర మీదికి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: