ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. 19 మంది కంటెస్టెంట్స్   బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నో ఎలిమినేషన్స్ తర్వాత ఏడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏడు మంది లో ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు  టాప్ ఫైవ్ లో నిలవబోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకోవడంతో  ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఈ కార్యక్రమం చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నుండి ప్రతి వారం కూడా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే వారంతం వచ్చే సరికి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయంపై కూడా అటు ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రేక్షకులకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగి అందరికీ షాక్కి గురి చేస్తూ ఉంటుంది.



 ఈ క్రమంలోనే ఇటీవల బిగ్బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేషన్ కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తప్పకుండా టాప్ ఫైవ్ లో ఉంటాడు అనుకున్న రవి ఇక నిన్నటి వారం ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఇటీవల బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు యాంకర్ రవి. ఈ సందర్భంగా మీ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు.. నా ఎలిమినేషన్  ఇంకా నమ్మలేకపోతున్నాను... అంతా షాకింగ్గా ఉంది  అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం రవి మాత్రమే కాదు బిగ్బాస్ ప్రేక్షకులు మొత్తం రవి ఎలిమినేషన్ తో షాక్ అవుతున్నారు. బిగ్ బాస్ పై విమర్శలు గుప్పిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: