టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే,  భారీ క్రేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన  ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున పుట్టిన రోజు సందర్భం గా చిత్ర బృందం విడుదల చేయగా ఈ పోస్టర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త మాత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది, ఘోస్ట్ చిత్ర బృందం మొదట ఈ సినిమాకు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకుంది, అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ అగర్వాల్సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి, అయితే ఆ స్థానంలో అమలా పాల్ ను తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నట్లుగా, అయితే అమలా పాల్ ఈ సినిమాలో నటించేందుకు చాలా మొత్తం రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు దానితో చిత్ర బృందం అమలా పాల్ ను తీసుకోకుండా మెహరీన్ కోసం సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజా గా వస్తున్న వార్తల ప్రకారం మెహరీన్ ను ఘోస్ట్ చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తోంది, మరి ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే నాగార్జునసినిమా తో పాటు సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా కు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండ గా, అక్కినేని నాగ చైతన్య ఒక ప్రముఖ పాత్రలో కనిపించ బోతున్నాడు, ఈ సినిమా లో అక్కినేని నాగ చైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: