చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు దాదాపుగా పదిహేను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నిర్మాతలలో కూడా ఒక రకమైన భయం నెలకొందని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఏంటనే దానిపై ఆందోళన మొదలైంది అని అంటున్నారు. ప్రస్తుతం తీవ్రత తక్కువగా ఉన్నాసరే భవిష్యత్తులో కేసులో మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అగ్ర హీరోల సినిమాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప ఈ సినిమాకు సంబంధించి కాస్త ఇప్పుడు ఆందోళన మొదలైంది.
వచ్చే నెలలో ఈ సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతున్న సరే పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు ఏంటనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడిన లేకపోతే సినిమా వసూళ్లు తక్కువ వచ్చినా సరే ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అర్జున్ కాస్త కంగారు పడుతున్నాడని సినిమా విడుదలను వాయిదా వేసి అంశానికి సంబంధించి నిర్మాత కూడా చర్చిస్తున్నట్టు గా కూడా ప్రచారం జరుగుతోంది.