రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలకు సంబంధించి కాస్త అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్న సరే సినిమా ఫలితాలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు రీ ఎంట్రీ తర్వాత రెండు విడుదల అయినా సరే ఆ రెండు సినిమాలు కూడా ఆసక్తికరంగా లేకపోవడం సినిమా కథ కూడా ఇబ్బందికరంగా ఉండటంతో వసూలు కూడా పెద్దగా రాలేదు. ఈ సినిమాలకు సంబంధించి నిర్మాత రామ్ చరణ్ కాస్త ఇబ్బంది పడటంతో చిరంజీవి కూడా రెమ్యునరేషన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గారని అయితే ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విషయంలో కూడా దాదాపు ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి కొరటాల శివ చాలా సీరియస్ గా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా ఆందోళన దెబ్బ కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసులు మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సినిమా విడుదల అయినా సరే సినిమా చూడటానికి అభిమానులు వస్తారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. సినిమా విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ అనేక విధాలుగా ప్రచారం చేస్తున్న అభిమానుల్లో ఉత్సాహం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నా సరే పరిస్థితి అనుకూలంగా ఉండే సూచనలు పెద్దగా కనపడటం లేదు.

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి కొరటాల శివ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారని ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడంతో సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిందని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఈ సినిమా విషయంలో ఏం విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి ఇబ్బంది పడవచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: