మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవడం తో ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబో తున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియల్ గా తెలియజేసింది. ఈ సినిమా తో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నా డు. ఈ సినిమా తో పాటు రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ధమాకా సినిమా లో కూడా నటిస్తున్నాడు, ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మరియు కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్లు తెలుస్తోంది.

ఇలా ఈ మూడు సినిమా షూటింగ్ లను శర వేగంగా పూర్తి చేస్తున్న రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వం లో రావణాసుర అనే సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమా తో పాటు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా రవితేజ నటించడానికి రెడీ గా ఉన్నాడు. ఇలా ఇప్పటికి మూడు సినిమాల షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేస్తున్న రవితేజ మరో రెండు సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టుకొని ఉన్నాడు. అయితే ఇదంతా కూడా పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ కు హిట్ రావడం వల్లనే ఇలా వరుస సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: