గతంలో అగ్ర హీరోల మధ్య పోటీ అంటే చాలు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా చూడడమే కాకుండా సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ఏంటనే దానిపై కాస్త అంచనాలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా నందమూరి మెగా ఫ్యామిలీ మధ్య కాస్త కనపడని వార్ జరుగుతూ ఉంటుంది అని ప్రచారం కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో బాలకృష్ణ సినిమా సంక్రాంతికి విడుదల అయితే అదే సమయంలో చిరంజీవి సినిమా విడుదలైతే ఎవరు సినిమా విజయం సాధిస్తుంది ఎవరు సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది ఎన్ని రోజులు ఆడుతుంది ఏంటనే దానిపై కాస్త ఎక్కువగానే ఉండేవి.

ప్రస్తుత నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా చిరంజీవి ఆచార్య సినిమా ద్వారా ముందుకు వస్తున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాల వసూళ్ల కు సంబంధించి రెండు ఫ్యామిలీలు అభిమానులు ఆసక్తి కరం గా చూడటం గమనార్హం. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత మరో సినిమాను కూడా ప్లాన్ చేసి ఆ సినిమాను వేసవిలో విడుదల చేసే విధంగా సిద్ధమవుతున్నారు.

గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో సినిమాల విడుదలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన సినిమాలు ఎలా అయినాసరే వేసవిలో విడుదల చేసి ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమాలు దసరాకు విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోందని చిరంజీవి కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను వేగంగా పూర్తి చేసి ఆ సినిమాను కూడా వేసవిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.ఎలాంటి పోటీ ఉంటుందో ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: